యువకుడి వేధింపులు: ఆత్మహత్య చేసుకున్న 9వ తరగతి బాలిక
హైదరాబాద్: పక్కింటి యువకుడి వేధింపులకు తట్టుకోలేక మహబూబ్ నగర్ జిల్లాలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... మక్తల్ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన తిమ్మయ్య, కతలమ్మల మూడో కుమార్తె రుక్మిణి 9వ తరగతి చదువుతోంది.
ఇంటి పక్కనే ఉండే గోవిందు తరచూ వెంటపడి వేధిస్తుండేవాడు. ఈనెల 20న పెదనాన్న భోజప్ప ఇంటికి ఒంటరిగా వెళ్లిన సమయంలో ఆమె వెనకే వచ్చిన గోవిందు రుక్మిణితో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆ అవమానాన్ని భరించలేక చనిపోతున్నానంటూ లేఖ రాశి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా చేస్తున్నందుకు తనను మన్నించాలని, అన్నకు ఆడపిల్ల పుడితే తన పేరు పెట్టుకోవాలని లేఖరో రాసింది.

విషయం తెలుసుకున్న
తల్లిదండ్రులు రుక్మిణి మృతిపై గుండెలు బాదుకుంటూ విలపించారు. తమ గ్రామంలో 8వ తరగతి వరకే ఉండటంతో నాలుగు రోజుల క్రితమే మక్తల్‌లో 9వ తరగతిలో చేర్పించామని అన్నారు.
ఆ దుర్మార్గుడు వెంటపడి తన కుమార్తెను వెధింపులకు గురి చేస్తున్నా తమకు చెప్పకుండా పైలోకానికి వెళ్లిందని మృతురాలి తల్లి వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications