అతడితోనే పెళ్లి కావాలి: పోలీసులకు చుక్కులు చూపించిన యువతి

హైదరాబాద్: తాను కోరుకున్న యువకుడితోనే పెళ్లి జరిపించాలని కోరుతూ ఓ యువతి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీసు స్టేషన్ ముందు బైఠాయించిన ఆ యువతి ఆ తర్వాత అర్థరాత్రి నిద్ర మాత్రలు మింగి గుండె దడ పుట్టించింది.

దిల్‌షుక్‌నగర్‌వో నివసించే ఓ యువతి నిరుడు షాదీ డాట్ కామ్‌లో వరుడి కోసం వెతుకుతుండగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఎస్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎన్. విజయ్ దీప్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు.

Girl demands marriage with her fiancee

విజయ్ దీప్, యువతి కలిసి తిరిగారు. నిరుడు డిసెంబర్ 5వ తేదీన ఇరువురి కుటుంబాలు కూడా వారికి పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. యువతి తల్లిదండ్రులు రూ.10 లక్షల నగదు, రూ.25 లక్షల విలువ చేసే ఫ్లాట్ ఇవ్వడానికి అంగీరించారు. పెళ్లి పనులు జరుగుతుండగా విజయ్ దీప్ ఆమె తనకు నచ్చలేదని పెళ్లికి నిరాకరించాడు.

దాంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే విజయ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, కథ దాంతో ముగిసిపోలేదు. అతనితోనే తనకు పెళ్లి జరిపించాలంటూ యువతి పోలీసుల చుట్టూ తిరుగుతోంది. అది తమ పని కాదని పోలీసులు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+