పార్టీ పేరుతో పిలిచి, బిటెక్ అమ్మాయిపై ముగ్గురు గ్యాంగ్ రేప్, అరెస్ట్
హైదరాబాద్: భాగ్యనగరంలోని వనస్థలిపురంలో ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యవకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పార్టీ చేసుకుందామని ఇంటికి పిలిచి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.
బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలు బిటెక్ విద్యార్థిని అని తెలుస్తోంది.

సదరు బిటెక్ విద్యార్థినిని పార్టీ పేరుతో ముగ్గురులో ఒకడు పిలిచాడు. వనస్థలిపురం కుసుమానగర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఈ నెల 15వ తేదీన ఈ ఘటన జరగింది. ముగ్గురు ఆమె పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యువతి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమెతో వారికి స్నేహం ఉందని, దానిని అడ్డుపెట్టుకొని పిలిపించుకొని ఘాతుకానికి పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications