కూతురిపై తల్లి కర్కశత్వం, కిరోసిన్ పోసి నిప్పంటించింది ఎందుకిలా?
పిండి సంచి కిందపడేసిందనే కోపంతో కన్న బిడ్డను ఓ తల్లి కిరోసిన్ పోసి తగులబెట్టింది. స్థానికులు మంటలార్పారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం చింతగూడెంలో చోటుచేసుకొంది.
షాద్ నగర్ : చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేసింది తల్లి, మానవత్వానికే మచ్చతెచ్చేలా ఆ తల్లి ప్రవర్తించింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక ఉస్మానియాలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన షాద్ నగర్ లో చోటుచేసుకొంది.
రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండల పరిధిలోని చింతగూడెం గ్రామానికి చెందిన చెన్నయ్య,స్వరూప దంపతుల కూతురు రాధిక. ఆమె వయస్సు పదేళ్ళు.
శనివారం నాడు స్వరూప తన కూతురు రాధికను పిండి పట్టించుకురావాలని కోరింది. పిండి పట్టించుకొనే ఇంటికి తిరిగి వచ్చింది రాధిక.

పిండి సంచి బాగా బరువు ఉండడంతో ఇంటికి తీసుకువచ్చిన ఆ సంచి ఆమె కిందపడేసింది .దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి రాధికను విపరీతంగా కొట్టింది.
అంతేకాదు రాధికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. చుట్టుపక్కల వాళ్ళు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే రాధిక తీవ్రంగా గాయపడింది .షాద్ నగర్ లో ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఉస్మానియాకు తరలించారు.












Click it and Unblock the Notifications