బస్సును ఆపేసి, అందులోంచి దింపి యువతిని కిడ్నాప్ చేశారు
హైదరాబాద్: ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సును అపి, అందులో వెళ్తున్న యువతిని దింపి, ఆమెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు.
హైదరాబాదులోని కొత్తపేటలో నివసిస్తున్న అరికట్ల సరస్వతిరెడ్డి, రఘుపతి రెడ్డి దంపతుల ుకూతరు దీప్తిరెడ్డి. ఆమె రాజమండ్రి రాజానగరంలో కెఎల్ఆర్ - లెనోరా డెంటల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చింది.

బుధవారం రాత్రి 11.20 గంటలకు కాళేశ్వరి ట్రావెల్స్ బస్సులో రాజమండ్రి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత సరస్వతీ రెడ్డి ఫోన్‌లో దీప్తిరెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే, ఫలితం కనిపించలేద.
ఆమెకు అనుమానం వచ్చి బస్సు డ్రైవర్ ఫోన్ నెంబర్ సంపాదించి, అతడితో మాట్లాడింది. ఎల్‌బి నగర్ రింగ్ రోడ్డు వద్దక కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని, బస్సు ఆపినప్పుడు దీప్తిరెడ్డితో వారు మాట్లాడారని, తల్లిదండ్రులకు ప్రమాదం జరిగిందని చెప్పి తీసుకుని వెళ్లారని చెప్పాడు. దాంతో సరస్వతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications