వీడిన చిన్నారి హత్య మిస్టరీ: చోరీ చేస్తున్నప్పుడు చూసినందుకే....

మేడ్చల్: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఎల్లంపేటకు చెందిన బాలిక ఇందూ శ్రీసాయి ప్రసన్నలక్ష్మీ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన ఓ బాలుడు హత్యచేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. చిల్లర దొంగతనాలకు మరిగిన ఓ బాలుడు బుధవారం లక్ష్మీప్రసన్న ఇంట్లో రూ.5 వేలు దొంగతనం చేశాడు.

ఆ నగదు దొంగతనం చేయడాన్ని ప్రసన్నలక్ష్మీ చూసిందని, తన పేరు బయటపెడుతుందని భయపడి షేవింగ్ బ్లేడ్‌తో గొంతు, మణికట్టు కోసి అతను దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం రాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఎల్లంపేట గ్రామాన్ని సందర్శించారు. ఈ కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయని, శనివారం అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.

Sri sai Lakshmi Prasanna

ఇందు శ్రీసాయి ప్రసన్న లక్ష్మి ఇంటి సమీపంలోనే ఆ బాలుడు ఉంటాడు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బాలుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య చేసినట్లుగా అంగీకరించాడని తెలిసింది. తాను దొంగతనం చేస్తుండగా లక్ష్మీప్రసన్న చూసిందని, దీంతో బయట చెబుతుందోమోనని భయంతో ఆమెను షేవింగ్‌ బ్లేడ్‌తో హత్య చేసినట్లుగా బాలుడు చెప్పినట్లు సమాచారం.

మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ మండలం ఎల్లంపేటలో బుధవారం మధ్యాహ్నం 3.40 గంటలకు భవానీ-కృష్ణమూర్తిల రెండో కూతురు శ్రీసాయి లక్ష్మీప్రసన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీప్రసన్నను బ్లేడుతో గొంతు కోసి ఎడమ చేయి మణికట్టును కూడా తెగనరికి బాత్రూంలో పడేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+