ఇంట్లోకి చొరబడి మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం
హైదరాబాద్: మాయ మాటలు చెప్పి ఓ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన హైదరాబాదులోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈదీబజార్‌కు చెందిన బాలిక(15) స్థానిక పాఠశాలలో పదో వతరగతి చదువుతోంది.
అదే బస్తీలో ఉండే సయ్యద్ ముబాషరీఫ్(20) రాత్రి బాలిక ఇంట్లో ఎవరులేనిది చూసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఉదయం ఆ బాలిక విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో వారు సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రిస్తూండగానే రాత్రికి రాత్రే ఇంటి దోపిడీ జరిగింది. ఈ సంఘటన సికింద్రాబాదులోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.కిరణ్‌కుమార్ ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.

రాంగోపాల్ ఎన్‌క్లేవ్‌లో భాస్కరన్ అనే వ్యాపారి నివసిస్తున్నాడు. రాత్రి భోజనం చేసిన అనంతరం భాస్కరన్ కుటుంబసభ్యులతో ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయాడు. ఉదయం నిద్రలేసి మరో గదిలోకి వచ్చి చూడగానే కిటికి గ్రిల్స్ తెరిచి ఉన్నాయి. గదిలోని వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
అల్మారాలో దాచిన విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. అదనపు ఇన్‌స్పెక్టర్ లక్ష్మన్‌రాజు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన ఇంట్లో నుంచి దాదాపు 2.50 లక్షల విలువైన 20 తులాల బంగారు అభరణాలు, రూ.60 వేల నగదు కన్పించడంలేదని భాస్కరన్ ఫిర్యాదు చేశాడు. కేసును బోయిన్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications