ఘాతుకం: మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారం

హైదరాబాద్: హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మత్తు మందు ఇచ్ిచ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాదులోని లంగర్‌హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారంనాడు చోటు చేసుకుంది.

టోలీచౌకీ మిరాజ్ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలిక టోలీచౌకీలోని సీఫా ఎలైట్ షోరూంలో పనిచేస్తోంది. నౌ నంబర్ హుడా కాలనీనికి చెందిన హమీద్ (26) అదే షోరూంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఒకే షోరూంలో పనిచేస్తున్న వీరిద్దరు కూడా స్నేహితులయ్యారు.

రెండు రోజుల క్రితం హమీద్ ఆ బాలికను నానల్‌నగర్ వద్ద కలవాలని ఫోన్ చేశాడు. సమీపంలో తనకు కొద్దిగా పని ఉందని, ఆ తర్వాత కలిసి షోరూంకు వెళ్దామని ఆమెతో నమ్మబలికాడు. దీంతో ఆ బాలిక నానల్‌నగర్‌కు వచ్చింది. ద్విచక్రవాహనంపై గండిపేట వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ బాలికకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు.

Girl raped in Hyderabad by two youths

స్పృహ కోల్పోయిన బాలికపై అతను అత్యాచారం చేశాడు. తెలివి వచ్చిన తర్వాత ఆమె తనపై జరిగిన అఘాయిత్యంపై హమీద్‌ను నిలదీసింది. దీంతో అతను బాలికపై చేయి చేసుకున్నాడు. దీంతో బాలిక మళ్లీ స్పృహ కోల్పోయింది. దాంతో భయపడిన హమీద్ కిషన్‌బాగ్‌లో ఉండే తెలిసిన వైద్యుడి వద్దకు తీసుకుని వచ్చి చికిత్స చేయించాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి సమీపంలో దింపి వెళ్లాడు.

మర్నాటికి గానీ ఆమె పూర్తిగా మత్తు నుంచి తేరుకోలేదు. ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారంనాడు హమీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+