తల్లిదండ్రులకు కల్లు తాగించి, కూతురిపై రేప్, ఆపై హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సికింద్రాబాదులోని బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మానవ మృగం దాడి చేసి అత్యాచారానికి పాల్పడింది. ఆ తర్వాత బండరాయితో మోది కిరాతకుడు చిన్నారిని హత్య చేశాడు. ఆ దుర్మార్గుడిని మిలటరీ జవానులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. తల్లితండ్రుల పేదరికం, తాగుడు చిన్నారి ప్రాణాల మీదకు వచ్చింది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - మచ్చబొల్లారం కృష్ణనగర్ నివాసి అనిల్ పాత నేరస్థుడు. అతనిపైన ఎనిమిది క్రిమినల్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయి. ఇటీవలే మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఒక కేసులో జైలుకు వెళ్లి నాలుగు రోజుల క్రితం వచ్చాడు. యథాప్రకారం మచ్చబొల్లారం కళ్లు కాంపౌండ్‌లో కల్లు తాగటానికి వెళ్లాడు.

Girl raped and killed at Alwal in secendurabad

బొల్లారం కళాసిగుడాలో రామకృష్ణ దంపతులు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జూలై 2న సాయంత్రం కూలీ పనులు ముగించుకొని కల్లు దుకాణానికి వెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న అనిల్ వారిని పరిచయం చేసుకున్నాడు. తన సొంత డబ్బులతో కల్లు తాగించి వారి 10 సంవత్సరాల కూతురుకు తిను బండారాలు కొనిచ్చాడు.
తన మాయమాటలతో చిన్నారిని దగ్గరకు తీసుకున్నాడు. మరిన్ని కొనిస్తానని బయటకు తీసుకెళ్లాడు. జన సంచారం తక్కువగా ఉండే తిరుమలగిరి-బొల్లారం కెవిలరీ మిలటరీ బ్యారెక్స్ ప్రాంతానికి తీసుకవచ్చి చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి అత్యాచారం చేశాడు. బాలిక సృహ తప్పి పడిపోవటంతో బండరాయితో మోది హత్య చేసి పారిపోయాడు.

చిన్నారి తల్లితండ్రులు బాలిక తప్పిపోయినట్లు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలు పట్టాల వద్ద పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసిన మిలటరీ జవాన్లు బొల్లారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకోని బోల్లారం యస్‌ఐ సతీష్‌కుమార్ కేసు దర్యాప్తు ప్రారంభించి బొల్లారం కళాసిగుడా రామకృష్ణ కుమార్తెగా గుర్తించి సమాచారం అందించారు.

దాంతో కేసు సంబందించిన వివరాలు వెలుగు చూశాయి. నిందితుడు అనిల్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అనిల్‌ని మిలటరీ జవానులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని అంటున్నారు. కానీ పోలీసులు ధ్రువీకరించడం లేదు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl has been raped and killed at Alwal in Secendurabad of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి