వివాహేతర సంబంధం: చెట్ల పొదల్లో మహిళపై రేప్, హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని వేములవాడ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వెనక భాగంలోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం హత్యకు గురైన ఒక యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

వేములవాడ సిఐ శ్రీనివాస్ అందుకు సంబంధించిన వివరాలు అందించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ ప్రదేశంలో గుర్తు తెలియని యువతి మృతహం పడి ఉంద సమాచారం పోలీసులకు అందింది. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి యువతి మృతదేహాన్ని పరిశీలించామన్నారు.

అత్యాచారం గావించిన అనంతరం చున్నితో ఉరివేసి బిగించి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామని, అయితే మృతురాలిని గౌడ కల్పన (30) తంగళ్లపల్లి స్వస్థలంగా గుర్తించామని, ఆమె భర్త శ్రీనివాస్ గతకొద్దిరోజుల క్రితం ఒక వివాహం నిమ్మిత్తం షోలాపూర్ వెల్లి ఇంకా తిరిగి రాలేదని, కల్పనకు సన్నిహితుడైన వ్యక్తే నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం గావించి హత్య చేసినట్లుగా తెలుస్తోందని సిఐ తెలిపారు.

అయితేమృతురాలి మెడలో బంగారు పుస్తెలతాడు అలాగే ఉండటం, పెద్దగా ప్రతిఘటించినట్లు ఆనవాళ్లు లేకపోవడంతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తే నమ్మించి ఇక్కడి తీసుకువచ్చి ఈ ఘతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 Girl raped and killed in Karimanagar district

మృతురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని నెంబర్లపై నిఘావేశామని, త్వరలో నిందితున్ని పట్టుకుంటామని సిఐ శ్రీనివాస్ చెప్పారు. మృతురాలికి ఇరువురు పిల్లలు ఉండగా ఉపాధి నిమ్మిత్తం సిరిసిల్ల పట్టణంలో నివాసం ఉంటోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has been raped and killed near Vemulawada in Karimanagar district of Telanagna.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి