తారుమారు: అమ్మాయే అబ్బాయి అయితే...
సంగారెడ్డి: పదిహేడేండ్లపాటు జడ వేసుకుని, బొట్టు పెట్టుకుని చుడీదార్ వేసుకున్న అమ్మాయి ఇప్పుడు ప్యాంట్ వేసుకుని అబ్బాయిగా మారిపోయాడు. వైద్య చరిత్రలో ఓ వింత ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. మెదక్ జిల్లా చిన్నశంకంరపేట పరిధిలోని బాగిర్తిపల్లికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతుల కూతురు భవాని (17)గా పెరిగి పెద్దదైంది.
ప్రస్తుతం మెదక్‌లో బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో చేరింది. గత ఏడాది డిసెంబర్‌లో తీవ్రమైన కడుపునొప్పి రావడంతో హైదరాబాద్‌కు తరలించగా భవానీ అమ్మాయి కాదు..అబ్బాయని వైద్యు లు నిర్ధారించారు. బాలుడిగా జన్మించిన భవాని పురుషాంగం శరీరంలోనే ఉండిపోవడంతో తల్లిదండ్రులు బాలికగానే భావించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి శరీరంలోని పురుషాంగాన్ని బయటికి తీశారు.

భవాని ఇప్పుడు భానుప్రసాద్‌గా మారాడు. మరో రెండు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రెండేండ్ల కిందట వైద్యులను సంప్రదించినప్పుడు భవానికి ఆడపిల్లకు ఉండాల్సిన అవయవాలు లేవని, పెండ్లి ఆలోచన విరమించుకోవాలని వైద్యులు చెప్పారని తల్లి భాగ్యమ్మ తెలిపింది. భర్త నాగులు 15 ఏండ్ల కిందటే మృతిచెందాడని తెలిపింది. అమ్మాయి కాస్తా అబ్బాయిగా మారడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications