"సామాన్యులు కరెంట్ బిల్ కట్టకపోతే పవర్ కట్.. మరి ఆ యూనివర్సిటీ ఏమైనా స్పెషలా..?"
తెలంగాణలోని గీతం యూనివర్సిటీ.. ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించలేదంటూ TGSPDCL ఆ యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. అయితే దీనిపై ఆ వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. సదరు యూనివర్సిటీ 2008 నుంచి రూ. 118 కోట్ల బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్యులు రూ. 1000 కట్టకపోతే అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని.. గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ SE హాజరుకావాలని ఆదేశించారు.
తెలంగాణలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాన్యులకు రూ. 1000 ఉంటేనే అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని అలాంటిది.. గీతం యూనివర్సిటీ రూ. వంద కోట్లకుపైగా బకాయిలు ఉంటే ఎలా చూసీ చూడకుండా ఉన్నారని మండిపడింది.

గీతం యూనివర్సిటీ 2008 నుంచి రూ. 118 కోట్ల బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేష్ భీమపాక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు రూ. 1000 బిల్లు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని, అలాంటప్పుడు గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలని.. సూపరింటెండెంట్ ఇంజినీర్(SE) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications