GO 317: ఉద్యోగులను స్వస్థలాలకు పంపండి, హామీ నిలబెట్టుకోండి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్న జీవో నం.317 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, బాధితులను వారి స్వస్థలాలకు బదిలీ చేసేలా 'వన్ టైం రిలీఫ్' ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తమ లేఖలో కవిత గత పరిణామాలను ప్రస్తావించారు. 2021లో అప్పటి ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసినప్పుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆనాడు ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని స్పష్టంగా పేర్కొన్నారని ఆమె లేఖలో ఉటంకించారు.

సొంత జిల్లాలకు బదిలీ చేయాలి..
"ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. జీవో నం.317 బాధితులకు వారి స్థానికత (Locality) ఆధారంగా వన్ టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు బదిలీ అయ్యే అవకాశం కల్పించాలి. దీనివల్ల వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో నెలకొన్న అభద్రతాభావం తొలగుతుంది" అని కవిత పేర్కొన్నారు. కేవలం బదిలీలు మాత్రమే కాకుండా, స్థానికతను గుర్తించే నిబంధనల్లో కూడా సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
మంత్రివర్గ బాధ్యతపై విమర్శలు..
ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు నేతలు గతంలో బాధితులకు న్యాయం చేస్తామని అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారని కవిత గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయడం సరికాదని, తక్షణమే ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ చేసి ఉద్యోగుల సమస్యను కొలిక్కి తీసుకురావాలని ఆమె తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో కవిత రాసిన ఈ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317 ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి… pic.twitter.com/APMQMAokyj
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 30, 2026












Click it and Unblock the Notifications