గోల్కొండలో ఆషాఢ తొలి బోనాలు ప్రారంభం: పట్టువస్త్రాలతో మంత్రులు, సందడిగా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ బోనాలు వైభవంగా మొదలయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ మేరకు లంగర్‌హౌస్ వద్ద జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు.. మంత్రులు పట్టువస్త్రాలను అందజేశారు.
ఆ తర్వాత లంగర్‌హౌస్ నుంచి బోనాల తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ బడాబజార్, ఛోటా బజార్‌ల మీదుగా కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలి పూజ ముగిసింది. పట్టు వస్త్రాలు, బంగారు బోనం, తొట్టెల ఊరేగింపుతో లంగర్‌హౌస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న బోనాలు పండుగ మొదటి పూజ అట్టహాసంగా సాగింది. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు జరిగిన బోనాల ఊరేగింపులో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణ వచ్చాక రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకొంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. భారత దేశంలో హిదువుల గురించి మాట్లాడతారు కానీ.. హిందువుల పండుగలకు సహకరించేది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. రానున్న బోనాల పండుగకు పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలన్నారు.
Today Golconda Bonalu 🚩🙏 pic.twitter.com/JDVX7uIqMg
— Jalli Rajiv Gandhi Mudiraj Narsingi (@JNarsingi) June 22, 2023
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లతాడుతూ.. రాష్ట్రంలోని 3036 దేవాలయాలకు రూ.11 కోట్లను ఖర్చు చేశాం. ఇవాళ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమర వీరుల జ్యోతి వెలిగించి.. దీంతో పాటు బోనాలు కూడా ప్రారంభమౌతాయి. ప్రజలందరూ.. సహకరించి పండుగను నిర్వహించుకోవాలి. బోనాల పండుగకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించారు. నెల రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఈ ఏడాది అట్టహాసంగా జరగబోతుందని అన్నారు.
Along with my team , I attended the opening ceremony of Bonalu festivities in #Hyderabad city which traditionally start off from Golconda and then go onto Mahankali and Lal Darwaza and AkkannaMadanna temples later on .
— CV Anand IPS (@CVAnandIPS) June 22, 2023
This is one festival which is very typically of Telangana… pic.twitter.com/hFdry5MN9R
గోల్కొండ ఆషాఢ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని.. దీని ద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సీఎం పేర్కొన్నారు.
తరతరాల తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని సీఎం కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications