Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: 7045 కోట్ల పెట్టుబడులతో ఆ రంగానికి బిగ్ బూస్ట్.. 40,000 కొత్త ఉద్యోగాలు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ద్వారా పర్యాటక రంగంలో 7,045 కోట్ల భారీ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందాలతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

పర్యాటక రంగంలో పెట్టుబడులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించాలని భావించారు. అందులో భాగంగానే ఆతిథ్యం, వినోదం, ఆరోగ్యం, సాంస్కృతిక, సాహస, పర్యాటక రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ కేంద్రంగా మార్చడానికి ప్రయత్నాలు సాగించారు.ఈ ప్రయత్నం 40వేల మందికి ఉద్యోగాలను ఇవ్వనుంది.

Good news Big boost to tourism with investments of Rs 7045 crore 40 000 new jobs

Take a Poll

తెలంగాణాకు పర్యాటక ప్రాజెక్ట్ లు.. వేల కోట్ల ఎంవోయూలు
భారత్ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నానికి ఫలితంగా అనేక ప్రముఖ ప్రాజెక్టులు వచ్చాయి. ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ మూడువేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ కన్వెన్షన్ నిర్మించడానికి ఎంఓయూ చేసుకుంది. ఇది అంతర్జాతీయ కన్వెన్షన్ తో పాటు ట్రేడ్ మరియు ఎగ్జిబిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ 1000కోట్ల రూపాయలతో గోల్ఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది.

వివిధ దేశాల ప్రాజెక్ట్ లను హైదరాబాద్ కు తెచ్చిన రేవంత్ సర్కార్
సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 కోట్లతో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గాంధీ పేట సమీపంలో కే ఈ ఐ గ్రూపు 200 కోట్ల రూపాయలతో గ్లాస్ హౌస్ గ్రీన్ హౌస్ కన్వెన్షన్ కేంద్రాన్ని అభివృద్ధి చేయనుంది. టర్కీ కి చెందిన పాలిన్ గ్రూప్ మల్టీవర్స్ హోటల్స్ 300 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి ఆక్వా మెరైన్ పార్క్ ను, ఆక్వా టన్నెల్ ను ఏర్పాటు చేయనున్నాయి.

హైదరాబాద్ లో 300 కోట్ల రూపాయలతో కృత్రిమ బీచ్
స్పెయిన్ కు చెందిన ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 300 కోట్ల రూపాయలతో కృత్రిమ బీచ్, లగూన్ అండ్ రిసార్ట్ ప్రాజెక్టును చేపడుతుంది మాల్దీవులకు చెందిన అట్మాస్పియర్ కోర్ హోటల్స్ హైదరాబాద్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన వెల్నెస్ రీ ట్రీట్ ను ఏర్పాటు చేయనుంది.

అనేక వ్యూహాత్మక ఒప్పందాలు
ఇవి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రచారం కోసం పలు వ్యూహాత్మక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. iifa ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్లతో భాగస్వామ్యం ద్వారా సుమారు 550 నుంచి 600 కోట్ల రూపాయల ఆర్థిక ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+