రైతన్నలకు శుభవార్త.. వీరి ఖాతాల్లోకి రైతుభరోసా డబ్బులు.. ఎప్పుడంటే!
ఆరుగాలం శ్రమించి ఎండనక వాననక కష్టించి వ్యవసాయం చేసిన అన్నదాతలకు కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇక రైతన్నల కష్టాన్ని పట్టించుకోని రైతులకు సహాయం అందించాల్సిన ప్రభుత్వాలు రైతులను ఎదురుచూసేలా చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును ఇంతవరకు ఇవ్వలేదు.
రైతు భరోసా అమలుకు పక్కా ప్రణాళికలు
ఇక రైతులు దీనికోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ప్రణాళికలను రూపొందించింది.

ఆ భూముల సర్వే నెంబర్లు బ్లాక్
వర్షాకాలంలో సాగుచేసిన భూముల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం దాదాపు 1.49 కోట్ల ఎకరాలలో పంటలు సాగు అయినట్టు నివేదికల ఆధారంగా గుర్తించింది . ఇక వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా రైతుభరోసా నిధులను రైతుల ఖాతాలలో వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తాజా వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం దాదాపు మూడు లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కాదని తేల్చి వాటి సర్వే నెంబర్లను కూడా బ్లాక్ చేశారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి పెట్టుబడి సాయం ఎంతంటే
ఇక వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున రైతు భరోసా నిధులను రైతులకు అందించడానికి శుభ ముహూర్తం పెట్టారు. రైతు భరోసా అమలుతో 8900 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది.
ఖాతాలలో డబ్బు పడే రోజు కోసం నిరీక్షిస్తున్న రైతులు
ఇక రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 12 వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందించడానికి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడనుండడంతో ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications