రైతులకు శుభవార్త.. వాటికోసం లక్ష తీసుకుంటే 40వేలు కడితే చాలు.. త్వరపడండి!
భారతదేశంలో అనేక సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు చాలావరకు క్షేత్రస్థాయిలో అందరికీ తెలియడం లేదు. రైతుల సంక్షేమం కోసం విభిన్న పథకాలు ఉన్నాయి . చిన్న సన్న రైతు సన్నకారు రైతుల కోసం ఇటు కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక పథకాలను అమలు చేస్తుంది.
రైతుల కోసం సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్కీమ్
మారుతున్న కాలంతోపాటు వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక పద్ధతులను అనుసరించడానికి, వ్యవసాయ రంగంలో యాంత్రికరణ ప్రోత్సహించడానికి, కూలీల సమస్యను అధిగమించడానికి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. గతంలో ఉన్న ఈ పథకాన్ని పునః ప్రారంభించి వ్యవసాయ యంత్ర పరికరాలను భారీ రాయితీపై అందిస్తున్నాయి. ఈసారి ఈ పథకంలో మహిళా రైతులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి.

వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు స్కీమ్ ద్వారా లబ్ది
వ్యవసాయ రంగంలో పెరుగుతున్న శ్రామికుల కొరతను నివారించడానికి, యంత్రాల ద్వారా వ్యవసాయ పనులను సులభతరం చేయడానికి ఈ పథకం కీలకంగా మారుతుంది. ఈ పథకంలో ఒక యూనిట్ యంత్రాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం 60 శాతం రాష్ట్రం 40% ఖర్చులను భరిస్తాయి. వివిధ కేటగిరీలను బట్టి రాయితీలు మారుతాయి.
కేటగిరీ వారీగా రాయితీలు ఇలా
సాధారణ చిన్న సన్నకారు మహిళా రైతులకు 60 శాతం రాయితీ ఇస్తే పెద్ద రైతులకు 40 శాతం ఎస్సీ ఎస్టీ పురుష రైతులకు 60 శాతం రాయితీ కల్పిస్తారు. సాధారణ పురుష రైతులకు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు విలువ చేసే ఒక పరికరాన్ని వ్యవసాయం కోసం రైతులు కొనుగోలు చేస్తే అది 60 వేల రాయితీ పోగా 40 వేలు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది.
ఈ వ్యవసాయ పరికరాల కోసం స్కీమ్
ఇలా రైతులకు కావాల్సిన వ్యవసాయ పరికరాలను ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ పథకం ద్వారా రోటవేటర్ లు, బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ రీడర్లు, విత్తనాలు విత్తనాలు, కల్టివేటర్ లు, పవర్ పిల్లర్లు, ట్రాక్టర్ సంబంధించిన వివిధ పరికరాలు అందిస్తారు. ఈ పరికరాలు రైతుల శ్రమను సమయాన్ని తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు
ఈ పథకంలో యంత్రాలను కొనుగోలు చేసి రాయితీ పొందాలనుకునే మహిళలు అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ బుక్, కుల ధ్రువీకరణ పత్రం, భూమి పత్రాల నకలు ఫోటోలు జత చేసి వ్యవసాయ అధికారికి లేదా మండల విస్తరణ అధికారికి సమర్పించాలి. ఈ పథకం ద్వారా రైతులు ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడానికి వీలు కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రైతులు త్వరపడండి.












Click it and Unblock the Notifications