ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు శుభవార్త.. ఈ డబ్బులు మీ ఖాతాలో!
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పథకాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయం జాబ్ కార్డు కలిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది.
జాబ్ కార్డు ఉంటే అదనంగా 90 రోజుల పని
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒకవేళ జాబ్ కార్డు ఉంటే అదనంగా 90 రోజుల పనిని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతుంది. ఉపాధి హామీ అనుసంధానం చేయడం ద్వారా జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారులకు రోజుకు 307 రూపాయల చొప్పున కూలీ లభిస్తుంది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలలో అదనంగా డబ్బులు
ఈ విధంగా గరిష్టంగా 90 రోజులకు 27 వేల 630 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలలో అదనంగా చేరుతాయి. దీంతోపాటు స్వచ్ఛభారత్ పథకం కింద టాయిలెట్స్ నిర్మించుకుంటే కూడా మరొక 12 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ మేరకు ఆదేశాలు వచ్చాయి.
90 రోజుల పని దినాలను వీరికి గృహ నిర్మాణం కోసం కేటాయింపు
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇంటి నిర్మాణ పనులు మినహా, ఇతర ఉపాధి హామీ పనులు కేటాయించరాదని స్పష్టమైన ఆదేశాలు రావడంతో జాబ్ కార్డులు ఉన్న ఇళ్ల లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఉపాధి హామీ కింద కల్పించే 90 రోజుల పని దినాలను వీరికి గృహ నిర్మాణం కోసం కల్పించనున్నారు. ఇంటి నిర్మాణంలోని వివిధ దశల ఆధారంగా వీరికి పనులు కేటాయిస్తారు.
పనుల కేటాయింపు ఇలా
బేస్మెంట్ లెవెల్ వరకు 40 రోజులు, లెంటల్ స్థాయి వరకు 30 రోజులు, నిర్మాణం పూర్తయిన తర్వాత 20 రోజుల పనిని కేటాయిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బేస్మెంట్ వరకు పనులు పూర్తయితే మిగిలిన పని దినాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.
జాబ్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం
ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులను వేరు చేస్తున్నట్టు వివిధ దశలలో మీరు పని చేస్తున్న ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించిన తర్వాత డబ్బులు జమవుతాయి. ఇక ప్రస్తుతం చాలామంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు జాబ్ కార్డులు ఉన్నట్టుగా తేలింది. ఎవరైనా జాబ్ కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించడానికి కూడా చర్యలు తీసుకుంటారు.
ఎంపీడీవో ద్వారా జాబ్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
కొత్తగా పెళ్లయిన మహిళకు ఇల్లు మంజూరు అయితే అప్పటికప్పుడు వారికి ఎంపీడీవో ద్వారా జాబ్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధి హామీ పథకం కింద వారికి 90 రోజుల పని కల్పించినట్టు అవుతుంది. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు పేదలకు ఆర్థిక భరోసా కూడా దీని ద్వారా కలుగుతుంది.
-
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications