కొత్త రేషన్​ కార్డుదారులకు GOOD NEWS

కొత్తగా రేషన్​ కార్డు పొందిన వారికి గుడ్​ న్యూస్. ఈ నెల నుంచే బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామ సభల ఆధారంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త రేషన్ కార్డు దారులకు ఈ నెలలోనే బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మిగతా లబ్ధిదారులను కూడా అధికారులు గుర్తిస్తున్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం నాలుగు జిల్లాల్లో కలిపి ఇప్పటికే 1,01,103 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అర్హులను గుర్తించే ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. వచ్చే నెల నుంచి వారికి కూడా బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Good News for New Ration Card Holders State Government to Begin Rice Distribution This Month

జాబితాలో పేర్లు లేకపోతే ఎలా..?

లబ్ధిదారుల జాబితాలో పేరులేని వాళ్లు సంబంధిత గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందించేవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఇటీవల పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. సామాజిక ఆర్థిక సర్వే, కులగణన, పాత రేషన్ కార్డుల ఆధారంగా జాబితా రూపొందించామని ఇందులో పేరు లేని వాళ్లు గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+