రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం GOOD NEWS.. ఇకపై 24 గంటలూ..

కొత్త రేషన్ కార్డులకోసం జనాలు మీ సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు 2.6 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. బుధవారం ఒక్కరోజే లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. రేషన్ కార్డుల దరఖాస్తుకు ఎలాంటి గడువు లేదని పేర్కొంది. లబ్ధిదారులు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవ కేంద్రాల వద్దకు పోటెత్తుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

వాళ్లు అవసరం లేదు..

కులగణన, ప్రజా పాలనలో అప్లికేషన్ సమర్పించినవాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యులు, పిల్లల పేర్లను కూడా చేర్చుతోంది. పుట్టింటి కార్డుల్లో దూరమైన మహిళల పేర్లు అత్తింటివారి కార్డుల్లో చేరుతున్నాయి. ఇప్పటికే దాదాపు 18 లక్షల మంది తమ రేషన్ కార్డు అప్డేట్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఇక అదనంగా లక్ష మందికి రేషన్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.31 కోట్ల భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు.

Good News for Ration Card Applicants No Deadline for Applications Says State Government

తెల్లరేషన్ కార్డు కోసం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు లోపు వార్షికాదాయం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాల గరిష్ఠ పరిమితిని ప్రభుత్వం విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+