తెలంగాణ మధ్యాహ్న భోజనం కుక్ కమ్ హెల్పర్లకు గుడ్‌న్యూస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కార్మికులకు పెంచిన వేతనాలు జులై నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్‌-కమ్‌ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి సబిత వెల్లడించారు.

పెంచిన వేతనాల వల్ల సంవత్సరానికి రూ.108 .40 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారిగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

 midday meal

తొలిమెట్టును విజయవంతంగా అమలుచేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వార్షిక ప్రణాలికను విడుదల చేస్తున్నామని మంత్రి సబిత తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్ లో చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

మరోవైపు, మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సబితా ఆదేశాలు జారీ చేశారు. కోటి రూపాయల కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్ఎంసి) అప్పగించి పనులను పూర్తి చేయాలన్నారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థినికి రూ. 5 లక్షలు సాయం

బీసీ రెసిడెన్షియ‌ల్ కాలేజీలో చ‌దివి ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ఎంపీసీలో 470 మార్కుల‌కు గానూ 468 మార్కులు సాధించిన హ‌రిత అనే విద్యార్థినికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అండ‌గా నిలిచారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఆమెకు రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అందించారు. కేసీఆర్ పంపించిన రూ. 5 ల‌క్ష‌ల చెక్కును శ‌నివారం మంచిర్యాల క‌లెక్ట‌రేట్ భ‌వ‌నంలో జిల్లా క‌లెక్ట‌ర్ బ‌దావ‌త్ సంతోష్‌తో క‌లిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ హ‌రిత‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు హ‌రిత త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జూన్ 9వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సంద‌ర్భంగా.. సీఎం కేసీఆర్ హ‌రిత‌ను అభినందించిన విష‌యం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+