మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లో రూ.2500
తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి మహిళకు రూ.2500 చొప్పున ఇవ్వనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ ఆరు గ్యారంటీల్లో ప్రతి ఇంట్లో అర్హత కలిగిన మహిళకు రూ.2500 చొప్పున ఇవ్వడం కూడా ఉంది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. ఇల్లు లేనివారికి ఇంటి స్థలం, అలాగే రూ.5 లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే కొన్ని పథకాలను అమలులోకి తెచ్చారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియడంతో మరికొన్ని హామాలను అమలు చేయబోతున్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వబోతున్నారు. ఈ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ.2500 అందుతాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు రూ.2500 అందుతాయన్నారు. జులై నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ పథకం విజయవంతమైంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఏపీలో ఇదే పథకాన్ని ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై అధికారులు అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం రాగానే ప్రారంభించనున్నట్లు ఏపీ రవాణాశాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications