టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో డీఏను మంజూరు చేసింది. అక్టోబర్ వేతనంతో కలిసి డీఏ చెల్లించనుంది. అలాగే, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న తొమ్మిది డీఏలను సైతం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సిన ఉన్న 4.8 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతలవారీగా ఇప్పటి వరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజాగా, డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించిందని వెల్లడించారు వీసీ సజ్జనార్ తెలిపారు.
కాగా, ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి.. గవర్నర్ ఆమోదం కోసం పంపింది ప్రభుత్వం. ఆ తర్వాత గవర్నర్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications