• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగులకు కేసీఆర్ బంపరాఫర్ : ఏకకాలంలో 50 వేల పైగా పోస్టుల భర్తీ - షర్మిల కు ఆ ఛాన్స్ లేకుండా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేష్ల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దం అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇప్పటికే అధికారులు కసరత్తు తీవ్రతం చేసారు. జోన్లలోని కేడర్ల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం మరో సారి వివాదం కాకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు రావటంతో..ఆ ఆదేశాల ఆధారంగా కసరత్తు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో అన్ని శాఖలు తమ పరిధిలో భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

50 -65 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం..

50 -65 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం..

అయితే, ఇప్పటికే 65 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లుగా ప్రాధమికంగా గుర్తించారు. దీని ద్వారా దాదాపుగా 50 వేల నుంచి 65 వేల వరకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దసరా కానుకగా నిరుద్యోగులకు వీటిని ప్రకటిస్తారని సమాచారం. స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్ల వారీగా.. మంజూరైన పోస్టులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో అన్ని ప్రభుత్వ శాఖలు ఇప్పటికే తమ పరిధి లోని విభాగాల నుంచి తెప్పిం చుకున్నాయి.

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జోనల్ నియామకాలు

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జోనల్ నియామకాలు

ఈ వివరాల పైన ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షల ద్వారా రాష్ట్రపతి తాజా ఆదేశాల మేరకు ఉద్యోగుల విభజనకు తుది రూపు ఇవ్వనున్నారు. దీని ద్వారా కేడర్ల వారీగా శాఖల పరంగా పూర్తి లెక్కలను సిద్దం చేయనున్నారు. ఈ నెల9వ తేదీ నాటికి అన్ని శాఖల నుంచి కేడర్ ల వారీగా ప్రభుత్వానికి పూర్తి స్పష్టమైన సమాచారం చేరనుంది. దీంతో...వీటి భర్తీతో పాటుగా ఇతర సర్వీసు అంశాల పైన ఆర్దిక శాక-ఇతర శాఖలతో సీఎస్ స్థాయిలో సమీక్షించి తుది నివేదిక సిద్దం చేయనున్నారు.

జాబ్ క్యాలెండర్ పైన కేసీఆర్ తుది నిర్ణయం..

జాబ్ క్యాలెండర్ పైన కేసీఆర్ తుది నిర్ణయం..

ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆర్థిక శాఖ సమర్పించనున్న ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే ఉద్యోగాల భర్తీ -నియామకాలకు సంబంధించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఉద్యోగాల భర్తీ పైన రాజకీయం గానూ దీని పైన చర్చ మొదలైంది. హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ తరువాత అనేక వర్గాలను మచ్చిక చేసుకొనే క్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. హుజూరాబాద్ బై పోల్ షెడ్యూల్ రాకముందే ఈ ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

షర్మిల దీక్ష ఎఫెక్టా..ఆ ఛాన్స్ లేకుండానా..

షర్మిల దీక్ష ఎఫెక్టా..ఆ ఛాన్స్ లేకుండానా..

దీంతో..ఈ నెలాఖరులోగా భర్తీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిళ తొలి నుంచి నిరుద్యోగులకు మద్దతుగా దీక్షలు ప్రారంభించార. తొలుత ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల దీక్ష చేసారు. ఇక, ఆ తరువాత ప్రతీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల ఇళ్లకు వెళ్లి వారికి మద్దతుగా దీక్షలు నిర్వహించారు. ఈ రోజు నుంచి తెలంగాణలోని యూనివర్సిటీల వద్ద దీక్షలు నిర్వహిస్తున్నారు.

Recommended Video

  ysr 12th Vardhanthi Report from Lotus pond | Oneindia Telugu
  హుజూరాబాద్ షెడ్యూల్ కు ముందే ప్రకటన..

  హుజూరాబాద్ షెడ్యూల్ కు ముందే ప్రకటన..

  అయితే, షర్మిల చెబుతున్న లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రెండున్నార లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 50 వేల నుంచి 65 వేల వరకు భర్తీ చేసే విధంగా కసరత్తు చేస్తోంది. దీని పైన సీఎం కేసీఆర్ సమీక్ష తరువాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు...మిగిలిన వాటి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రానుంది. అయితే, హుజూరాబాద్ బై పోల్ కు ముందే జాబ్ క్యాలెండర్ విడుదల ఖాయంగా కనిపిస్తోంది.

  English summary
  KCR govt planning to announce job notification for 50-65 thousand posts shortly. After 10th of this month CM KCR may take decision on job calender.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X