గుడ్‌న్యూస్: బ్యాంక్ అకౌంట్‌లో రూ.350
గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి రాయితీ కింద వచ్చే నగదును వినియోగదారుల ఖాతాల్లో కేంద్రం వేస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కారు మహాలక్ష్మీ పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ను రూ.500కే అందిస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ రూ.855గా ఉంది. పూర్తి ధర చెల్లించి వినియోగదారులు కొనుగోలుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలద్వారా రాయితీ నగదును వరి ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది.
ఆరు గ్యారంటీల్లో భాగంగా
కేంద్రం నుంచి సిలిండర్ తీసుకున్న వ్యక్తుల ఖాతాల్లో రూ.40.71 పడుతున్నాయి. తెలంగాణ ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత ఉన్న వంట గ్యాస్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500 మినహాయించనుంది. మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో వేస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రాయితీ కూడా సరిగా రావడంలేదు. తమ పేర్ల మీద సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సిలిండర్ తీసుకుంటున్న వ్యక్తి జీవించే ఉన్నారని చెప్పాలంటూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొత్త ఉత్తర్వులు జారీచేసింది.

కొత్త ఉత్తర్వుల జారీ
ఇదిలా ఉండగా.. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ కూడా కొందరికి రావడం లేదు. తమ పేర్ల మీద సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సిలిండర్ తీసుకుంటున్న వ్యక్తి ఉన్నారని చెప్పాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రాయితీ అందనుంది. e-KYC చేయని వారికి తక్కువ సిలిండర్లు ఇస్తారు. లేదంటే రాయితీ ఇవ్వకపోవడం జరుగుతుంది. ఉజ్వల్ పథకం కింద బీపీఎల్ సభ్యుల ఖాతాల్లో రూ.372, ఇతర కనెక్షన్లు ఉన్నవారికి రూ.40 రాయితీగా లభిస్తాయి.












Click it and Unblock the Notifications