హైదరాబాద్ నుంచి బెంగళూరు-ఊటీ-మైసూరు: తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీ ఇదే

హైదరాబాద్: వేసవి సెలవుల్లో పర్యటనలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ టూరిజం మరో మంచి ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన మైసూర్, ఊటీ, బెంగళూరుకు వెళ్లే పర్యాటకులకు ఈ ప్యాకేజీ గురించి తెలుసుకోవాల్సిందే. భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు మైసూర్‌, బెంగళూరు నగరల్లోనే ఉన్నాయి.

అందుకే, బెంగళూరు(BENGALURU), మైసూర్‌ (MYSORE), ఊటీ(Ooty) వెళ్లాలనుకునే పర్యాటకులకోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ఈ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. బెంగళూరు-ఊటీ-మైసూరు పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తుండ‌గా.. ప్రతీ సోమవారం ఈ టూర్ ప్యాకేజీని (Tour Package) బుక్‌ చేసుకోవచ్చు.

 tsrtctourisumpackage-

ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ, కున్నూర్ (Kunnru), బొటానికల్ గార్డెన్స్ (Botanical gardens), ఊటీ లేక్(Ooty Lake) దొడబెట్ట పీక్ (Dodabetta), టీ మ్యూజియం (Tea Museum), పైకారా జలపాతం (Pykhara Falls), మైసూర్‌, బెంగళూరు త‌దిత‌ర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. బస్సు మార్గంలో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఇది ఐదు రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది.

'బెంగళూరు-ఊటీ-మైసూరు టూర్' ఇలా కొనసాగనుంది..

మొదటి రోజు: మధ్యాహ్నం హైదరాబాద్‌లో (Hyderabad) టూర్ ప్రారంభం అవుతుంది. యాత్రి నివాస్(Yatrinivas) నుంచి మధ్యాహ్నం 03:30 గంటలకు.. బషీర్‌బాగ్‌లో సాయంత్రం 04:00 గంటలకు.. బ‌స్సు బయలుదేరుతుంది. మొదటి రోజు బెంగళూరుకు ప్ర‌యాణం ఉండ‌గా.. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

రెండో రోజు: ఉదయం బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. బుల్ టెంపుల్(Bull Temple), లాల్ బాగ్(Lal bagh), విశ్వేశ్వరయ్య మ్యూజియం(Visveswaraya Museum), ఇస్కాన్ టెంపుల్(Iskon Temple) దర్శించుకోవచ్చు. భోజనం త‌ర్వాత రాత్రి బెంగళూరులో బస ఉంటుంది.

మూడో రోజు: తెల్లవారుజామున 4 గంట‌ల‌కు ఊటీకి ప్రయాణం. మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటారు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. దొడ్డపెట, బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. భోజనం త‌ర్వాత రాత్రి ఊటీలో బస ఉంటుంది.

నాలుగో రోజు: ఉదయం మైసూర్ బయలుదేరాలి. సాయంత్రానికి మైసూరు చేరుకుంటారు. అనంత‌రం బృందావన్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి భోజనం, మైసూరులో బస ఉంటుంది.

ఐదో రోజు: ఉదయం 7 గంట‌ల‌కు మైసూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. చాముండేశ్వరి ఆలయం(Chamundeswari Temple), మైసూరు మహారాజ ప్యాలెస్(Mysore Maharaja Palace), బిగ్ బుల్ టెంపుల్(Big Bull Temple) సందర్శించొచ్చు. తిరుగు ప్ర‌యాణంలో రాత్రి మైసూరు నుంచి బయలుదేరాలి.

ఆరో రోజు: తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైద‌రాబాద్‌ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది.

హైదరాబాద్ టూ 'బెంగళూరు-ఊటీ-మైసూరు' ప్యాకేజీ ధ‌ర విషయానికొస్తే..
పెద్దలకు రూ.11,999
పిల్లలకు - రూ.9,599
సింగిల్ ఆక్యుపెన్సీ రూ.3,000 అదనపు
వోల్వో కోచ్, నాన్ ఏసీ వసతి ద్వారా పర్యటన.

మరిన్ని వివరాల కోసం https://tourism.telangana.gov.in/package/ootymysore వెబ్ సైట్ సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+