తెలుగువారిని విడిపించండి: ప్రధాని మోడీని కలిసిన గోపీకృష్ణ, బలరాం కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ: లిబియాలో ఉగ్రవాదుల అపహరణకు గురైన తెలుగువారు గోపీకృష్ణ, బలరాం కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలిశారు. తెలుగుదేశం ఎంపీలు మల్లారెడ్డి, రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో వారు ప్రధానితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటానని ప్రధాని వారికి చెప్పారు. ఉగ్రవాదుల చెర నుంచి గోపీకృష్ణ, బలరాంను విడిపించేందుకు కృషి చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.

అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కూడా వారు కలిశారు. ఉగ్రవాదుల నుంచి తమ వారిని వీలైనంత త్వరగా విడిపిచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.

Gopikrishna and Balaram family members met PM Modi

16 నుంచి యూఏఈ పర్యటనలో ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఆగస్టు 16న 'యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌'(యూఏఈ)కు వెళ్లనున్నారు. ఆ దేశాల్లో భారత ప్రధాని పర్యటించడం గత 34 ఏళ్లలో ఇదే ప్రథమం. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ యూఏఈలో పర్యటించారు. వాణిజ్యం, భద్రత అంశాలతో పాటు ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి వెూదీ ప్రసంగిస్తారు.

అధికార వర్గాల సమాచారం ప్రకారం.. అబుదాబీ, దుబాయ్‌లలో మోడీ పర్యటించనున్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, తీరప్రాంత భద్రతల పరంగా కుదుర్చుకున్న ఒప్పందాల అమల్లో అతి స్వల్ప పురోగతి మాత్రమే ఉన్న తరుణంలో మోడీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

యూఏఈలో ఉన్న విదేశీయుల్లో దాదాపు 30% మంది భారతీయులే. కాగా, దుబాయ్‌ క్రికెట్‌ మైదానంలో జరిగే భారీ స్వాగతోత్సవంలో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, ఫేస్‌బుక్‌లో పేజీని తెరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+