హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Raja singh: ఎమ్మెల్యే రాజాసింగ్‍పై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం..! త్వరలో నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే అతనిపై
విధించిన సస్పెన్షన్ ఎత్తేసేందుకు బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే రాజా సింగ్ పై సెస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం మునవర్ ఫారుఖీ హైదరాబాద్ లో పర్యటించారు. అతన్ని పర్యటనను వ్యతిరేకిస్తూ రాజా సింగ్ నిరసన తెలిపారు. ఆ సందర్భంంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

షోకాజ్ నోటీస్
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పార్టీ రాజ సింగ్ ను సస్పెండ్ చేసింది. షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. ప్రస్తుతం రాజా సింగ్ జైలులోనే ఉన్నారు. రెండు రోజుల కిందటే రాజాసింగ్ భార్య ఉషాబాయీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు ఆమె వివరిచారు. రాజాసింగ్ వివరణపై క్రమశిక్షణ సంఘం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

Goshamahal BJP MLA Rajasinghs suspension is likely to be lifted

పీడీ యాక్టు
సెప్టెంబర్ 2న రాజాసింగ్ ​ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 5న ఆయనపై పోలీసులు పీడీ యాక్టు పెట్టి చర్లపల్లి జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. అయితే అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ బీజేపీలోని సెకండ్ క్యాడర్, హిందుత్వ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీంతో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజా సింగ్ బెయిల్ ఇప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

English summary
Goshamahal BJP MLA Rajasingh's suspension is likely to be lifted. It is reported that the BJP Disciplinary Committee has expressed satisfaction with the explanation given by Raja Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X