జయ ఆరోగ్యంపై కర్నాటక సీఎం, అపోలోలో గవర్నర్ 10 ని.లే, వెంటే ఆసుపత్రి చైర్మన్
జయకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి ముంబై నుంచి హుటాహుటిన వచ్చిన ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు అపోలో ఆసుపత్రిలో కేవలం పది నిమిషాలు ఉన్నారు.
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి కలత చెందానని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే.

పది నిమిషాలే ఉన్న ఇంచార్జ్ గవర్నర్
జయకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి ముంబై నుంచి హుటాహుటిన వచ్చిన ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు అపోలో ఆసుపత్రిలో కేవలం పది నిమిషాలు ఉన్నారు. ఆయన ఎవరిని కలిశారో తెలియరాలేదు. రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడే అవకాశముంది. గవర్నర్‌తో పాటు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా రాజ్ భవన్ వెళ్లారు. గవర్నర్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
కాగా, గత రెండు నెలలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరలో ఇంటికి చేరుకుంటారని భావిస్తున్న సమయంలో మళ్లి అనారోగ్యానికి గురికావడంతో అన్నాడీఎంకే నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. జయలలిత అనారోగ్య పరిస్థితి తెలిసి మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.












Click it and Unblock the Notifications