Gadwala News: గద్వాల న్యూడ్ వీడియోల ఘటనపై ప్రభుత్వం సీరియస్..!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గద్వాల న్యూడ్ వీడియోల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తిరుమలేశ్‌ అలియాస్‌ మహేశ్వర్‌రెడ్డితోపాటు నిఖిల్, వినోద్‌లను పోలీసులు అరెస్టు చేశారు.ఈ కేసుకు సంబంధించి రాజకీయ పార్టీకి చెందిన నాయకులకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గద్వాలలో ప్రజా సంఘాలు, ప్రతిపక్షా పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేటీదొడ్డి ఎస్ఐ హరిప్రసాద్ పై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు.

నగ్న వీడియోలు
గద్వాలకు చెందిన కొందరు కొద్ది రోజులుగా మహిళలను, అమ్మాయిలను ట్రాప్‌ చేస్తున్నారు. వారి నగ్న వీడియోలు, కాల్స్‌ రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. మరింతగా వేధిస్తున్నారు. నగ్న చిత్రాలను సేకరించి.. తాము చెప్పిన వారి దగ్గరకు వెళ్లాలంటూ ఆ మహిళలను నిందితులు బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే పలువురు మహిళల అర్ధ నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 Government is serious about Gadwala nude videos incident

పార్టీ అధిష్ఠానం
దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌కు ప్రజా సంఘాలు ఫిర్యాదు కూడా చేశాయి. స్థానిక పోలీసులపై ఒత్తిళ్లు ఉన్నాయని, సిట్‌తో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని డీజీపీకి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కాగా మహిళలపై ట్రాప్, బ్లాక్‌ మెయిలింగ్‌ ఘటనకు సంబంధించి ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతతో పార్టీ అధిష్టానం మాట్లాడినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రికి పార్టీ అధిష్ఠానం ఫోన్ చేసి విషయం ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎవరున్నా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+