గవర్నర్ రబ్బర్ బొమ్మలా: నారాయణ, 'అది చంద్రబాబు గొంతే'
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ రబ్బర్ బొమ్మలా వ్యవహరిస్తున్నారని, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రుల పైన సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ సోమవారం డిమాండ్ చేశారు.
నాడు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో సభాపతి డమ్మీగా ఉండేవారన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అదే విధానం కొనసాగుతోందని ఆరోపించారు.
ఎందుకింత కక్ష: ఎల్ రమణ
రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎందుకు అంత కక్ష అని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని టీడీపీ కోరుకుంటోందన్నారు.

అధికారంలో ఉన్నది మీరా మేమా చెప్పాలని తెరాసను ప్రశ్నించింది. ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తెరాసదే అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఏపీ మంత్రి దేవినేని ఉమ రాసిన లేఖ పైన చర్చిద్దామన్నారు. దీనిపై అఖిల పక్షం వేయాలన్నారు.
ఆడియోటేప్ చంద్రబాబుదే: విష్ణు
ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్లో రికార్డు అయిన వాయిస్ చంద్రబాబుదేనని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చంద్రబాబు ఏడాది పాలనకు పరాకాష్ట అన్నారు. ఆడియో టేబుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని, వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. చంద్రబాబు నిజాన్ని ఒప్పుకొని రాజీనామా చేయాలన్నారు.












Click it and Unblock the Notifications