ప్రభుత్వాన్ని రద్దు చేస్తాననలేదు - కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది : గవర్నర్ క్లారిటీ..!!
తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి తన వ్యాఖ్యల పైన స్పష్టత ఇచ్చారు. తాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నన్ను విమర్శించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారన్నారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌తో విభేదించినా, రాజ్‌భవన్‌ను గౌరవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు.
తాను గవర్నర్‌గా మాత్రమే పనిచేస్తున్నానని..తనకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఏ పదవిలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారన్నారు.

తాను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా అంటూ నిలదీసారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని వివరించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. ఇన్విటేషన్లను పొలిటికల్‌గా చూడొద్దని గవర్నర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications