Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ - ఆమోదం పొందేనా..!!

ఇప్పడు అందరి చూపు రాజ్ భవన్ వైపే. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు పైన ఇంకా గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. రాజ్ భవన్ నుంచి అడిగిన అన్ని వివరణలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆటు అర్టీసీ కార్మికులు బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను కోరారు. దీంతో, ఇప్పుడు గవర్నర్ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది. ఈ రోజు నిర్ణయం కీలకం కానుంది.

ఊహించని మలుపులు: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం అంశం మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. గవర్నర్‌ తమిళిసై, ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. గర్నవర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం రెండోసారి వివరణ ఇచ్చినా గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Governor Tamilisai Soundararajan

బీఏసీ నిర్ణయం ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు ఇవాళ లాస్ట్‌ డే. గవర్నర్‌ ఇవాళ ఆర్టీసీ విలీన బిల్లుకు అనుమతిస్తే.. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గనుక గవర్నర్ అనుమతించకపోతే బిల్లుకు బ్రేకులు పడే ఛాన్స్‌ ఉంది.

గవర్నర్ సందేహాలకు ప్రభుత్వ సమాధానం: తెలంగాణ మంత్రివర్గం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి నిర్ణయించింది. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించాలని భావించింది. ఇందు కోసం మనీ బిల్లు కావటంతో గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అక్కడ ఆమోదం ఇచ్చే సమయంలో గవర్నర్ పలు క్లారిఫికేషన్లు ప్రభుత్వం నుంచి అడిగారు. వీటికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇవాళ్టితో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ సెషన్‌లో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం లభిస్తుందో లేదోనని ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారు.

ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొన్నా, చట్టానికి తగ్గట్లుగా ప్రభుత్వం నియమాలను తయారు చేస్తుందని తెలిపింది. ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు లక్ష్యమని రాజ్‌భవన్‌కు తెలిపింది.

Governor Tamilisai Soundararajan

గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ: రాజ్‌ భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన యూనియన్‌ నాయకులతో తమిళిసై పుదుచ్చెరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ప్రభుత్వం పంపిన వివరాలపై గవర్నర్‌ సంతృప్తి చెందలేదని.. మరిన్ని వివరాలు పంపించాలని మధ్యాహ్నం తర్వాత గవర్నర్‌ కార్యాలయం కోరింది. ఆ తరువాత మరోసారి రాజ్ భవన్ ను మరిన్ని సందేహాల పైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరగా..సమాధానం పంపారు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదంపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+