వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్‌పై గవర్నర్ అసంతృప్తి -డెడ్‌లైన్ విధింపు -సర్కారుకు ఘాటు లేఖ

|
Google Oneindia TeluguNews

రాజ్యాంగ పరంగా తెలంగాణ రాష్ట్ర పాలకురాలైన గవర్నరే.. ప్రభుత్వానికి ఘాటు లేఖ రాయడం, కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోన్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

Rihanna, Mia Khalifaలాంటోళ్లకు అమిత్ షా కౌంటర్ -దేశ ఐక్యతను దెబ్బతీయలేరంటూ..Rihanna, Mia Khalifaలాంటోళ్లకు అమిత్ షా కౌంటర్ -దేశ ఐక్యతను దెబ్బతీయలేరంటూ..

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై ఘాటు లేఖ రాశారు. వీసీల నియామకం చేపట్టకపోవడంపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 రోజుల్లోగా వీసీలను నియమించాలని ఆమె ఆదేశించారు. తెలంగాణలోని 11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీసీల నియామకం కోసం 2019 జులై 3న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్లుగా వీసీల నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇన్‌చార్జ్‌ వీసీలు, రిజిస్ట్రార్లతో గవర్నర్‌ తమిళిసై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్వ విద్యార్థులను యూనివర్సిటీలతో అనుసంధానంపై గవర్నర్ ఆరా తీశారు.

 Governor Tamilisai strong letter to kcr govt over VC appointments

విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించి.. వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాలు.. బోధించే ఆచార్యులు లేక వెలవెలబోతుండటం, రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ఎటువంటి ప్రభుత్వం చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు..

జగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలుజగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలు

Recommended Video

Andhra Pradesh : SI Sirisha మానవత్వం పై Ys Jagan ప్రభుత్వం ఫిదా !

ఏళ్ల తరబడి గెస్ట్‌ ఫ్యాకల్టీ, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే నెట్టుకొస్తుండడంతో ఉన్నత విద్యలో నాణ్యత కొరవడటం, కీలకమైన వైస్‌ చాన్సలర్ల పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉండడం, పాలకమండళ్లను నియమించకపోవడంతో పోస్టుల భర్తీ విషయంలో వర్సిటీలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుండటం తదితర అంశాలపై కొద్దీ రోజుల కిందట బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు.

English summary
Governor Tamilisai Soundararajan wrote a scathing letter to the Telangana government. The governor expressed deep dissatisfaction over the appointment of visas. Out of all 11 varsities in Telangana, the vacant chancellor posts in July alone have not been filled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X