రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ తమిళిసై సంచనలం: రేపు తెలంగాణ గిరిజన తండాలో: వ్యాక్సిన్ అక్కడే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారం ఆమె రంగారెడ్డి జిల్లాలోని ఓ గిరిజన తండాను సందర్శించనున్నారు. అక్కడే కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గిరిజన తండాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోనున్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్నప్పటికీ- గిరిజనులకు అది అందట్లేదని, టీకాపై వారికి అవగాహనను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈటల బాటలో కోమటిరెడ్డి?: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డితో భేటీ: తెలంగాణ ఈక్వేషన్లు మారుతాయా?ఈటల బాటలో కోమటిరెడ్డి?: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డితో భేటీ: తెలంగాణ ఈక్వేషన్లు మారుతాయా?

వ్యాక్సిన్ తీసుకునే విషయంలో వారిని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యతలను తాను తీసుకుంటానని వ్యాఖ్యానించారు. గిరిజనులతో కలిసి తాను వ్యాక్సిన్ తీసుకుంటానని, ఫలితంగా- వారిని చైతన్యవంతులను చేసినట్టవుతుందని తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌పై గిరిజనుల్లో ఉన్న భయాన్ని, ఆందోళనను పోగొట్టడంతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారనేది ఖాయమే అయినప్పటికీ- ఏ గిరిజన గ్రామాన్ని సందర్శిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.

Governor Tamilisai will get the Covid19 vaccine in a tribal village in Rangareddy district on July 12

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి తమిళిసై సౌందరరాజన్ ఇన్‌ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్‌గా ఉంటోన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పుదుచ్చేరిలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలనేది తమ లక్ష్యమని ఆమె అన్నారు. అక్కడ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తొలుత కొంత భ్రమలు నెలకొన్నప్పటికీ.. ఆ తరువాత అవి తొలగిపోయాయని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటోన్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి అందరకీ టీకా ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించుకున్నామని చెప్పారు.

English summary
Telagana Governor Tamilisai Soundararajan will get the Covid19 vaccine in a tribal village in Rangareddy district on July 12 among the tribals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X