వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ-విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం : మోయలేం-తప్పదు : ఎంత మేరంటే...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం..తాజా నష్టాల పైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణీకుల పైన భారం తప్పదనే సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ - విద్యుత్ సంస్థల ఆర్దిక నిర్వహణ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని సంస్థ ఛైర్మన్ తో పాటుగా అధికారులు సీఎంకు నివేదించారు. ష్టాల నుంచి బయటపడాలంటే చార్జీలు పెంచాల్సిందేనని అన్నారు.

ఆర్టీసీ- విద్యుత్ సంస్థలను ఆదుకోవాలంటే

ఆర్టీసీ- విద్యుత్ సంస్థలను ఆదుకోవాలంటే

చార్జీల పెంపుతోపాటు ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ అసాధ్యమని తేల్చిచెప్పారు. చార్జీలు పెంచడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. కరోనా లాక్‌డౌన్‌తోపాటు కేంద్రం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా సంస్థ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతోందని తెలిపారు. ఆర్థిక సంక్షోభం నుంచి సంస్థను ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీని పటిష్ఠ పరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని... కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభించామన్నారు.

భారీ నష్టాల్లో ఆర్టీసీ..

భారీ నష్టాల్లో ఆర్టీసీ..

గాడిలో పడుతుందనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని.. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభించామని చెప్పారు. గాడిలో పడుతుందనుకుంటున్న నేపథ్యంలో కరోనా.. డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.

వచ్చే కేబినెట్ ముందుకు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు

వచ్చే కేబినెట్ ముందుకు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు

ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే క్యాబినెట్‌ సమావేశం ముందుకు రావాలని అధికారులకు ఆదేశించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్‌ ధరలు లీటరుకు రూ.22 పెరగడంతో ఆర్టీసీపై రూ.550 కోట్ల అదనపు ఆర్థిక భారం పడిందని సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. డీజిల్‌తోపాటు టైర్లు, ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతోందన్నారు. మొత్తంగా సాలీనా రూ.600 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయ్సాల్సి వస్తోందన్నారు.

నాడు ఇచ్చిన హామీతో ఆలోచనలో..

నాడు ఇచ్చిన హామీతో ఆలోచనలో..

లాక్‌డౌన్‌ల వల్ల ఆర్టీసీ సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందన్నారు. కేవలం హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు నష్టం వస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 97 డిపోలూ నష్టాల్లోనే నడుస్తాయని వివరించారు. ఇలాంటి కష్టకాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్‌కు చెప్పారు. గతేడాది మార్చిలోనే ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందని, కరోనా కారణంగా పెంచలేదని గుర్తుచేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

భయంతోనే ఢిల్లీ నేతలను గల్లీకి పిలుపించుకున్నాడని రేవంత్ పై మండిపడ్డ జీవన్ రెడ్డి
విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదంటూ

విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదంటూ

అదే విధంగా.. విద్యుత్తు సంస్థలూ నష్టాల్లోనే ఉన్నట్లుగా అధికారులు సీఎంకు నివేదించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే విద్యుత్తు సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్‌ చర్చించారు. గత ఆరేళ్లుగా విద్యుత్తు చార్జీలను సవరించలేదని, విద్యుత్తు సంస్థలను గట్టెక్కించడానికి చార్జీలు పెంచాలని విన్నవించారు. దీంతో ఆర్టీసీతోపాటు విద్యుత్తు అంశంపై క్యాబినెట్‌లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
Govt almost decided to hike Power and RTC charges in coming days. CM directed officials to submit proposals for next cabinet meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X