కౌలు రైతులకు రైతుబంధు, తాజా మార్గదర్శకాలు - వారికి ఇక లేనట్లే..!!
హామీల అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రైతుబంధు రూ 15వేలకు పెంపుతో పాటుగా అర్హులు- అనర్హుల లెక్క తేల్చే ప్రక్రియ వేగవంతం చేసింది. అందులో భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతుబంధు అమలు దిశగా నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక..పారదర్శకంగా పథకం అమలు చేసేందుకు వీలుగా సాగులో ఉన్న భూమి వివరాల ఆధారంగా లబ్దిదారులను ఫైనల్ చేయనుంది.
రైతుబంధు అమలు
తెలంగాణలో కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున పెట్టుబడిసాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల వరకు ఉంటారు. కౌలు రైతులను గుర్తించే విధి విధానాలను మంత్రివర్గ ఉప సంఘం ఖరారు చేయనుంది.

పారదర్శకంగా ఉండేలా
గత ప్రభుత్వం అమలు చేసిన విధంగగా కాకుండా..అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలుచేస్తామంటోంది. పూర్త పారదర్శకంగా ఈ స్కీమ్ అమలుచేస్తామని ప్రభుత్వం వెల్లడిచింది. రైతుకు ఉన్న భూమి ఎంత? ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో సర్వే చేస్తున్నారు. సేకరించిన లెక్కల ఆధారంగా రైతుభరోసాపై అంచనాకు వస్తారు. ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తే.. అంతవరకే రైతు భరోసా చెల్లిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో.. ప్రతి రైతుకూ ఎకరాకీ ఏడాదికి 10 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 5 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.
ప్రభుత్వం కసరత్తు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించాల్సి ఉంది. కానీ అనర్హులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైతే గానీ రైతు భరోసా అమలవ్వదు. అప్పటివరకూ రైతు బంధు కిందే నిధుల పంపిణీ జరుగుతోంది. కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, బడా వ్యాపార వేత్తలకు ఈ పథకం వర్తించదు. అలాగే బీడుభూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వరు. రైతు భరోసాని 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కసరత్తు తరువాతనే ప్రభుత్వం రైతు బంధు అమలు పై తుది నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications