Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మద్యం ధరలు పెంపు, వీటికి మినహాయింపు - కొత్త రేట్లు..!!

మందుబాబులకు మింగుడు పడని నిర్ణయం. భారీగా మద్యం ధరల పెంపుకు రంగం సిద్దమైంది. అధికారికంగా ప్రకటన మిగిలి ఉంది. కొంత కాలంగా మద్యం ధరల పెంపు కోసం ప్రతిపాదనల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మద్యం విక్రయాల్లో కొత్త మార్పులు చేస్తున్నారు. బ్రాండెడ్ మద్యం కోసం ఆహ్వానించిన టెండర్లకు భారీ స్పందన వచ్చింది. టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం విక్రయాల పైన ప్రతిపాదనలు వచ్చాయి. ఇక, తాజాగా ధరల పెంపులో కొన్నింటిని మినహాయించాలని నిర్ణయించారు. కొత్త ధరలను ఖరారు చేసారు.

ధరల పెంపు
రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెంపుకు రంగం సిద్దమైంది. రెండు నెలల క్రితం రాష్ట్రంలో బీర్ల ధరల ను పెంచారు. ఆ సమయంలోనే లిక్కర్ ధరల పెంపుకు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం లిక్కర్ ధరల పెంపుకు ఆమోదం లభించినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కాగా, ఎక్కువ మంది తాగే చిఫ్‌ లిక్కర్‌ను ఈ ధరలు పెంపు నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2023 - 24లో 3.62 కోట్లు కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగగా, 2024-25లో రెండు శాతం పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం పెంపులో భాగంగా రూ 500 మించిన ధరల పైన పది శాతం వరకు పెంపుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

govt-likely-to-hike-liquor-rates-as-excise-latest-proposals

కొత్త లెక్కలు
ఎంఆర్పీ ధరను ఆధారంగా ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. మూడు కేటగిరీల్లో మద్యం ధరల పెంపుకు ప్రతిపాదనలు సమర్పించారు. ఏ విధానం అమలు చేస్తే ఎంత మేర ఖజానాకు ఆదాయం పెరుగుతుందనే లెక్కలు వివరించారు. గత ఆర్దిక సంవత్సరంలో 30 వేల కోట్లకు పైగా మద్యం పైనా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరో రెండు వేల కోట్ల రూపాయాల వరకు అదనంగా పెంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీర్ల ధరల పైన తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరల పెంపు నిర్ణయం ఐదేళ్ల తర్వాత జరిగింది. ఇక, మద్యం ధరల విషయంలో పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలు.. అక్కడ రేట్ల అధారంగా అధికారులు పెంపుదల పైన నివేదిక సమర్పించారు.

తాజా ప్రతిపాదనలు
ఇక, టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం అమ్మకాల పైన ప్రతిపాదనలు సమర్పించారు. కర్ణాటక లో ఈ తరహాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా విధానం అమలు చేయాలని భావించినా.. రాజకీయంగా విమర్శలు రావటంతో అమలు కాలేదు. ఇక, ఈ విధానం ద్వారా తయారీ ఖర్చు కొంత మేర తగ్గి.. వినియోగ దారుడికి మద్యం ధరలు తగ్గుతాయని లెక్కలు వేసారు. ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తరువాత ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపాదించారు. ఈ అంశం పైన ఇంకా ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదు. దీంతో, ఇప్పుడు ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే అధికారిక నిర్ణయం కోసం మందుబాబులు వేచి చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+