స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించిన వెంకయ్య: ఏపీలో 3, టీలో 2 నగరాల ఎంపిక
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 ఆకర్షణీయ నగరాల(స్మార్ట్ సిటీ) జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విడుదల చేశారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్య నాయుడు జాబితాను ప్రకటించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 98 నగరాల్లో 13 కోట్ల జనాభా ఉందని తెలిపారు. రాబోయే ఆరేళ్లలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కోసం రూ.3లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఆకర్షణీయ నగరాల కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా 13 నగరాలు ఎంపిక చేసినట్లు చెప్పారు. తమిళనాడులో12, మధ్యప్రదేశ్‌లో 7, గుజరాత్, కర్ణాటక నుంచి 6 నగరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 3, బీహార్‌లో 3 నగరాలను ఎంపిక చేసినట్లు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. కాగా, నగరాల పేర్ల ప్రతిపాదనకు జమ్ముకశ్మీర్ సమయం అడిగిందని తెలిపారు.
ప్రస్తుతం 100 స్మార్ట్ నగరాలకు రూ. 48వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ప్రతీ స్మార్ట్ సిటీకి ఐదేళ్ల కాలంలో ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను కేటాయించనుంది.












Click it and Unblock the Notifications