గుడ్ న్యూస్: ఎట్టకేలకు వారి ఖాతాల్లో రుణ మాఫీ నిధులు జమ..!!
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు వారికి రుణ మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసింది. దీని ద్వారా ఈ ప్రక్రియ అధికారికంగా అమలు మొదలైంది. నేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33కోట్లు విడుదల చేసినట్టు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకురావ డంతో పాటు పునరుద్ధరించినట్టు ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ నిర్ణయం కీలకంగా మారుతోంది.
చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొనే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చేనేత కార్మికుల రుణమాఫీలో భాగంగా రూ.33 కోట్లను విడుదల చేసింది. విడుదలైన మొత్తాన్ని పూర్తిగా రుణాల క్లియరెన్స్‌కే వినియోగించనున్నారు. ఇందుకోసం హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్, అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. లబ్ధిదారుల వివరాలు ఖరారు చేసిన తర్వాత.. వారి అప్పుల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా మార్గదర్శకాలు ఖరారు చేసారు. ఈ నిర్ణయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.

చేనేత కార్మికులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అప్పుల బాదరబందీకి ఈ నిధుల విడుదల కొంతవరకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల నేతన్నలకు నిరంతర ఉపాధి లభిస్తుందని, అందులో భాగంగా టెస్కోకు రూ.588కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హనుమకొండ జిల్లాల్లోని 130 ఎంఏసీఎస్, 56 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద, స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల ఉత్పత్తి జరిగిందని వివరించారు.












Click it and Unblock the Notifications