Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ జిల్లాలలో 144సెక్షన్, లిక్కర్ బంద్, వాటిపై నిషేధం!!

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. సాయంత్రం తో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో నేడు సాయంత్రం నుంచి మూడు ఉమ్మడి జిల్లాలలో సైలెంట్ పీరియడ్ ప్రారంభమవుతుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని మూడు జిల్లాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

ఎన్నికల వేళ వాటిపై నిషేధం
ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా నేడు సాయంత్రం 4గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రాజకీయపరమైన బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం విధించినట్లు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. ఉపఎన్నికల పోలింగ్ ముగిసే 48గంటల ముందునుండి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.

graduate MLC by election Section 144 Liquor Bandh ban on bulk sms in those districts

ఆ జిల్లాలలో లిక్కర్ బంద్
ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీలు, అలాగే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం దృష్టిలో ఉంచుకొని నేడు సాయంత్రం 4 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వవద్దని మూడు జిల్లాల కలెక్టర్లు కోరారు. ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాలలోనూ వైన్స్ షాపులు, బార్లు రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 144 సెక్షన్
ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి పోలింగ్ రోజు 27వ తేదీన సాయంత్రం నాలుగు గంటల వరకు లిక్కర్ షాపులు మూసి వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న నేపధ్యంలో ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈ క్రమంలోనే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు.

ఆ జిల్లాలలో ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే
ఈ సందర్బంగా బహిరంగ సభలు,ర్యాలీలు నిషేధం ఉంటుందని, ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూడరాదని పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవ్వరు లోపలికి రాకూడదని సూచించారు.కావున ప్రజలు విషయం పైన దృష్టి సారించి పోలీస్ అధికారులకు,సిబ్బందికి సహకరించాలని కోరారు.ఎవరైనా ఈ నియమ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తే అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+