గ్రేటర్ వార్ .. పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సెటైర్లు .. ఆపాలని పవన్ ఫ్యాన్స్ వార్నింగ్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం రసవత్తరంగా సాగుతున్న వేళ, ప్రధాన పార్టీల నాయకులపై కేసులు నమోదవుతున్న వేళ ఆ విషయాన్ని పక్కన పెట్టి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ వెంట పడ్డాడు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేస్తున్నారు. ఇక దీంతో పవన్ ఫ్యాన్ ఆర్జివికి ఇంకా ఆపు చాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై వేసిన సెటైర్ ఏంటి అంటే..

జీహెచ్ ఎంసీ ఎన్నికలలో పవన్ ప్రమేయం .. ఆర్జీవీ ఆసక్తి
రాంగోపాల్ వర్మ సినీ దర్శకుడు అయినప్పటికీ, అప్పుడప్పుడూ ఆయన రాజకీయాల్లో వేలు పెడుతుంటారు. అందులో భాగంగానే తాజాగా ఆయన జిహెచ్ఎంసి ఎన్నికలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అసలు ఆయన ఆసక్తికి కారణం పవన్ కళ్యాణ్ అట. పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం, ఆ తర్వాత పోటీ లేదని చెప్పడం రాంగోపాల్ వర్మ కు పవన్ కళ్యాణ్ ను ఆడుకోడానికి ఆయుధమైంది. అందుకే రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్నారు.

రాజకీయాల్లో పవన్ ను మాత్రమే అనుసరిస్తానన్న ఆర్జీవీ .. పవన్ పై సెటైర్
ఇక ఆర్జీవీ పవన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గొప్ప ఎంటర్టైనర్. అందుకే నేను రాజకీయాల్లో అతని మాత్రమే అనుసరిస్తాను. నాకు పవన్ తప్ప రాజకీయాల గురించి ఏమీ తెలీదు అంటూ రాంగోపాల్ వర్మ పవన్ కు సెటైర్ వేశారు. అంతేకాదు అందుకు రెండు ట్వీట్లు కారణం అని కూడా రాంగోపాల్ వర్మ చెప్పారు . మొదటి ఎన్నికల్లో పవన్ పోటీ చేయడం, మరొకటి అదే పోటీ లేకపోవడం అంటూ పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు.గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ పవన్ ను టార్గెట్ చేస్తూ చాలాసార్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పవన్ పై ఆర్జీవీ సెటైర్లపై మండిపడుతున్న ఫాన్స్ .. ఆపాలంటూ వార్నింగ్
పవర్ స్టార్ అంటూ ఆర్జీవీ ఓ సినిమా కూడా తీసిన విషయం తెలిసిందే.ఇక తాజాగా జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి రామ్ గోపాల్ వర్మ చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. రాంగోపాల్ వర్మ మాట్లాడింది పొగడ్తనా, లేక సెటైరా అన్నది తెలుసుకోలేనంత అమాయకులం కాదంటూ పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు ఆపాలని వారంటున్నారు. లేదంటే ఊరుకునేది లేదంటూ కాంట్రవర్సీలకు అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మను హెచ్చరిస్తున్నారు. వర్మ ఇలాంటివి పట్టించుకుంటారా ? లేక మరింత రెచ్చిపోయి పవన్ ను టార్గెట్ చేస్తారా అనేది వేచి చూడాలి.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications