గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ గ్రూప్ 1 విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, గతంలో కొత్త నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రిలిమ్స్‌లో 14 తప్పులు ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక, గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని కోరారు. అయితే, అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్ పరీక్షాయిదా వేయాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
అంతేగాక, పరీక్షల నిర్వహణలో కోర్టులో జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టుల జోక్యంతో నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో గ్రూప్1 మెయిన్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది.
కాగా, ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. అంతేగాక, ఫిబ్రవరిలోగా మెయిన్స్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications