కెటిఆర్‌కు ‘టై’ అవార్డు: అభినందించిన అసోచాం ప్రెసిడెంట్, జీఎస్టీపై ఆందోళన(పిక్చర్స్)

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు(కెటిఆర్‌), కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లకు ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యుర్స్‌(టై), హైదరాబాద్‌ అవార్డులు లభించాయి. జయేశ్‌ రంజన్‌కు ‘ఎంటర్‌ప్రెన్యుర్‌ ఎకో సిస్టమ్‌ ఛాంపియన్‌' అవార్డు, కెటిఆర్‌కు ‘ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ ఎకోసిస్టమ్‌ విజనరీ అవార్డు ప్రధానం చేసినట్లు టై వెల్లడించింది.

హైదరాబాద్‌లో జరిగిన ఇంటిగ్రేషన్‌ నైట్‌ అవార్డుల కార్యక్రమంలో టై, హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ సఫిర్‌ అదేనీ చేతుల మీదగా జయేశ్‌ రంజన్‌ అవార్డును అందుకున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరు కాలేదు.

హైదరాబాద్ పారిశ్రామిక రంగానికి అనుకూలం: అసోచాం

హైదరాబాద్‌లో పారిశ్రామిక రంగానికి అత్యంత సానుకూల పరిస్థితులు కన్పిస్తున్నాయని వాణిజ్య మండలి అసోచామ్ నూతన ప్రెసిడెంట్ సునీల్ కనోరియా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉందనడానికి టీఎస్‌ఐపాస్‌ను ప్రవేశపెట్టడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈమధ్యకాలంలో హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందిందని, నగరంలో మౌలిక వసతులు భారీగా పెరిగాయని ఆయన కితాబిచ్చారు. పరిశ్రమలను ప్రోత్సహించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు పోటీపడుతున్నాయన్నారు. ఇరు రాష్ర్టాల్లో వ్యాపారానికి సానుకూల వాతావరణం కల్పించేందుకు సంబంధిత ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.

అసోచామ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన కనోరియా.. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలుసుకున్నారు. సోమవారం అసోసియేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశ ఆర్థిక, వ్యాపార పరిస్థితులపై ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

జీఎస్టీ వాయిదా ఆందోళన కలిగిస్తోంది

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియడానికి వస్తున్న నేపథ్యంలో జీఎస్టీ వంటి కీలక సంస్కరణలు అమలుకు నోచుకోకపోవడంపై ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

జీఎస్టీ అమలుపై ఆశలు దాదాపుగా అడుగంటిపోయాయని, దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు వృద్ధిచోదకంగా భారత్ ఎదిగేందుకు అందివచ్చిన అరుదైన అవకాశాన్ని జారవిడుచుకున్నట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. జీఎస్టీతోపాటు మరిన్ని కీలక సంస్కరణల అమలుకోసం ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని తమ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరిందన్నారు.

వచ్చేసారి 8శాతానికి వృద్ధి రేటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2015-16) దేశ వృద్ధిరేటు 7.4 శాతంగా ఉండొచ్చని, వచ్చేసారి(2016-17) 8 శాతానికి చేరువకావచ్చని కనోరియా అంచనా వేస్తున్నారు. జీఎస్టీ అమలుకాకపోయినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తుండటంతో వచ్చేసారి 8 శాతం వృద్ధి సాధ్యమేనన్నారు. దేశం గరిష్ఠ వృద్ధిని సాధించాలంటే మాత్రం జీఎస్టీనే బ్రహ్మాస్త్రం అని అన్నారు.

అసోచామ్ తెలంగాణ చాప్టర్ చైర్మన్‌గా శ్రీకాంత్

అసోచామ్ తెలంగాణ చాప్టర్ చైర్మన్‌గా శ్రీకాంత్ బడిగ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అసోసియేషన్ కూడా తమ వంతు ప్రయత్నం చేయనుందన్నారు. అసోచామ్ తెలంగాణ చాప్టర్ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ఇండస్ట్రీలకు వారధిగా వ్యవహరించనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రీ పాలసీ టీఎస్ ఐపాస్‌కు కార్పొరేట్ వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని ఆయన అన్నారు.

కెటిఆర్‌తో అసోచాం ఛైర్మన్

కెటిఆర్‌తో అసోచాం ఛైర్మన్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు(కెటిఆర్‌), కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లకు ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యుర్స్‌(టై), హైదరాబాద్‌ అవార్డులు లభించాయి. జయేశ్‌ రంజన్‌కు ‘ఎంటర్‌ప్రెన్యుర్‌ ఎకో సిస్టమ్‌ ఛాంపియన్‌' అవార్డు, కెటిఆర్‌కు ‘ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ ఎకోసిస్టమ్‌ విజనరీ అవార్డు ప్రధానం చేసినట్లు టై వెల్లడించింది.

అసోచాం

అసోచాం

హైదరాబాద్‌లో పారిశ్రామిక రంగానికి అత్యంత సానుకూల పరిస్థితులు కన్పిస్తున్నాయని వాణిజ్య మండలి అసోచామ్ నూతన ప్రెసిడెంట్ సునీల్ కనోరియా అన్నారు.

అసోచాం

అసోచాం

తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉందనడానికి టీఎస్‌ఐపాస్‌ను ప్రవేశపెట్టడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అసోచాం

అసోచాం

ఈమధ్యకాలంలో హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందిందని, నగరంలో మౌలిక వసతులు భారీగా పెరిగాయని ఆయన కితాబిచ్చారు.

అసోచాం

అసోచాం

పరిశ్రమలను ప్రోత్సహించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు పోటీపడుతున్నాయన్నారు. ఇరు రాష్ర్టాల్లో వ్యాపారానికి సానుకూల వాతావరణం కల్పించేందుకు సంబంధిత ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+