మంచు విష్ణుకు భారీ షాక్..జీఎస్టీ అధికారులు దాడులు

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందు, హీరో మంచు విష్ణుతో పాటు సినిమాలోని పలువురు ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని విష్ణు కార్యాలయంలోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

కన్నప్ప సినిమా బడ్జెట్ వివరాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పన్నులు, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో 'కన్నప్ప'ను నిర్మించినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా విష్ణు మాట్లాడుతూ, సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టేశామని, గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం.

GST officials are conducting simultaneous inspections on the Kannappa movie unit

ఇప్పుడు ఆయన నివాసంతో పాటు చిత్రయూనిట్ సభ్యుల ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేయడంతో సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం నటించారు. దీంతో వారి రెమ్యునరేషన్ల గురించి కూడా నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ దాడులు 'కన్నప్ప' సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+