వరంగల్ కొత్త మేయర్‌గా గుండు సుధారాణి,డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా... ఖమ్మంలోనూ అతివలకే పట్టం...

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌గా గుండు సుధారాణి,డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌ ఎన్నికయ్యారు. వరంగల్ కార్పోరేషన్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన మేయర్‌గా గుండు సుధారాణి,నూతన డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సుధారణి 29వ డివిజన్‌ నుంచి గెలుపొందగా... రిజ్వానా 36వ డివిజన్ నుంచి గెలుపొందారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మేయర్,డిప్యూటీ మేయర్ పదవులు రెండింటినీ మహిళలకే కట్టబెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం... వరంగల్‌లోనూ అదే ఫాలో అవడం గమనార్హం.

వరంగల్ మేయర్ ఎన్నికకు ముందు హైడ్రామా

వరంగల్ మేయర్ ఎన్నికకు ముందు హైడ్రామా

వరంగల్ మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు కొంత హైడ్రామా చోటు చేసుకుంది. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పోరేటర్లతో హరిత హోటల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,ఇంద్రకరణ్ రెడ్డి,గంగుల కమలాకర్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇద్దరు స్థానిక ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,దాస్యం వినయ్ భాస్కర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము సూచించినవారికి పదవులు ఇవ్వనందుకే వీరు కార్యక్రమానికి హాజరవలేదన్న ప్రచారం ఉంది. అయితే అనారోగ్య కారణాల వల్లే కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మేయర్,డిప్యూటీ మేయర్ వివరాలను అధిష్ఠానం సీల్డ్ కవర్‌లో పంపించగా... మంత్రులు కార్పోరేటర్లకు చదివి వినిపించారు.

చివరి నిమిషంలో రిజ్వానా పేరు...

చివరి నిమిషంలో రిజ్వానా పేరు...

నిజానికి డిప్యూటీ మేయర్‌గా హన్మకొండలోని ఓ డివిజన్ నుంచి గెలిచిన నాగేశ్వర్ రావు అనే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. అయితే గుండు సుధారాణి హన్మకొండకే చెందినవారు కావడంతో... మేయర్,డిప్యూటీ మేయర్‌లను ఒకే ప్రాంతానికి ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో మంత్రులు వెంటనే అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపి రిజ్వానా షమీమ్‌ను డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. అనంతరం హోటల్ హరిత నుంచి ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ కార్పోరేటర్లు వరంగల్ కార్పోరేషన్ కార్యాలయానికి వెళ్లారు. కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్,డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అభ్యర్థులను పేర్లను వెల్లడించి చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. కరోనా బారినపడిన 8 మంది కార్పోరేటర్ అభ్యర్థులు వర్చువల్‌గా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఖమ్మంలోనూ అతివలకే పట్టం...

ఖమ్మంలోనూ అతివలకే పట్టం...

ఇక ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌లోనూ మహిళలకే రెండు పదవులు దక్కాయి. ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రా ఎన్నికయ్యారు. అధిష్ఠానం సీల్డ్ కవర్‌లో పంపించిన పేర్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్పోరేటర్ల సమావేశంలో ప్రకటించారు. అనంతరం ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయంలో కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం,మేయర్,డిప్యూటీ మేయర్ల ఎన్నిక పూర్తయింది.
పార్టీలో కష్టపడి పనిచేస్తారన్న గుర్తింపు ఉండటంతో నీరజకు మేయర్ పదవి దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల కార్పోరేషన్ ఎన్నికల్లో నీరజ 26వ డివిజన్ నుంచి,ఫాతిమా 37వ డివిజన్ నుంచి గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+