రాహుల్ గాంధీని నేనే రిసీవ్ చేసుకుంటాను - హరీష్..!!
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారని చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల చెప్పారని గుర్తు చేసారు.
ఎందుకు చేయలేదు
ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను అదానీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. అసెంబ్లీలో మేము అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారని హరీష్ చెప్పారు. అబద్దాలు చెబుతూ గోబెల్స్ ను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారని ప్రశ్నించారు. తాను విసిరిన ఛాలెంజ్ అదేనని చెప్పారు. 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితిగా చెప్పుకొచ్చారు.

రాహుల్ వస్తే
ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలని కోరారు. తాను ఎయిర్ పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి సీఎం రేవంత్ సొంత గ్రామానికి తీసుకువెళ్తానని హరీష్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని హరీశ్ చెప్పుకొచ్చారు. వాల్మీకి కుంభకోణంపై సైతం స్పందించారు. వాల్మీకి కుంభకోణంలో పట్టపగలు నిలువు దోపిడీ జరిగిందని.. ఈ కుంభకోణం గురించి సీఎం, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
ఫిర్యాదు చేద్దాం
వాల్మీకి కుంభకోణంలో తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వాల్మీకి కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేద్దామన్నారు. వాల్మీకి కుంభకోణంపై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాబట్టే కుంభకోణంపై ఈడీ దాడులు జరగట్లేదని ఆరోపించారు. కుంభకోణంపై విచారణ చేసి బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని.. ఈ కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సివిల్ సప్లయిస్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications