టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడి -మందిరం పేరుతో చందాల దందాలన్న ధర్మారెడ్డి వ్యాఖ్యలతో..
తెలంగాణలో క్రమంగా బలపడుతోన్న బీజేపీ.. ఇప్పుడు ఏకంగా అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిదుల్ని ఫిజికల్ గానూ టార్గెట్ చేస్తోంది. అయోధ్యలో రామమందిరంపై అనూహ్య వ్యాఖ్యలు చేసినందుకుగానూ హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి(పరకాల నియోజకవర్గం) ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి దిగారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అయోధ్యలో రామ మందిరానికి విరాళాల సేకరణపై ధర్మారెడ్డి విమర్శలు చేయడం ఈ పరిణామానికి దారి తీసింది..

బీజేపీ చందాల దందా..
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ నేతలు విచ్చలవిడిగా చందాలు వసూలు చేస్తున్నారని, రాముడి గుడి అంటూ బీజేపీ నేతలు సేకరిస్తోన్న విరాళాలకు అకౌంటబిలిటీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం పరకాలలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ, అయోధ్య ఆలయానికి విరాళాలపై ధర్మారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు...

పటేల్ విగ్రహం కట్టారు కదా..
''హిందువులంటే బీజేపీ పార్టీవాళ్లేనా? మేమూ హిందులమే. బీజేపీ.. దేవుని పేరుతో అకౌంటబులిటీ లేకుండా డబ్బులు వసూలు చేస్తోంది. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలు చెప్పగలరా? ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. 29 రాష్ట్రాల్లో రూ. 29 వేలకోట్లు ఏం చేస్తారు? గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి వేలకోట్లు వెచ్చించిన బీజేపీ వాళ్లు.. ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడి గుడిని నిర్మించలేరా?'' అని ధర్మారెడ్డి వ్యాఖ్యానించగా బీజేపీ నేతలు ప్రతిదాడికి దిగారు..

చల్లాకు కడియం పరామర్శ
అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం నిధుల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలను పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెళ్లారు. బీజేపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వస్తువులను కడియం పరిశీలించారు. కొద్ది రోజుల కిందట టీఆర్ఎస్ కే చెందిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. 'భద్రాద్రి రాముడికి కాకుండా అయోధ్య ఆలయానికి విరాళాలు ఇవ్వడమేంట'న్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications