కలెక్టర్‌ మురళి సంచలన వ్యాఖ్యలు: బ్రాహ్మణులపై వెటకారం

Subscribe to Oneindia Telugu

భూపాపల్లి: జయశంకర్‌ భూపాపల్లి జిల్లా కలెక్టర్‌ మురళి శుక్రవారం రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారంలో ప్రపంచ క్షయ వ్యాధి నిరోధక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంస్కృతిపై వివాదాస్పద, వెటకారపు వ్యాఖ్యలు చేశారు.

దళితుందరూ అడవి పంది, పంది మాంసం తినవచ్చునని ఈ ప్రాంతంలో ఉన్న అడవి పందులను చంపవచ్చునని వారిపై ఎటువంటి కేసు ఉండవని తెలిపారు. బ్రాహ్మణుల కట్టుబాట్ల పేరుతో అడవి పంది, పంది మాంసం తినవద్దని అనేక ఆంక్షలు పెట్టారని ఆయన విమర్శించారు.

Shankar bhupalpally collector Murali controversial comments on brahmins.

అడవి పంది, పంది మాంసం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, అమెరికాలో ఎక్కువ పంది మాంసం తింటారని, అక్కడ ఎటువంటి ఆంక్షలు లేవని అన్నారు. కాబట్టి పంది మాంసం తినవచ్చని, ఇంకా ఎక్కువ సంఖ్యలో అడవి పందులను చంపి ఆ మాంసాన్ని తినవచ్చునని ఆయన అన్నారు.

బ్రాహ్మణులు గాడిద గుడ్డు అని, అవి ఇవి ఆంక్షలు పెట్టి అడవి పంది మాంసాన్ని తినకుండా చేశారని, ఈ ప్రాంతంలో ఉన్న అడవి పందులను చంపి మాంసాన్ని తినవచ్చునని, ఈ అడవి ప్రాంతంలో ఎటువంటి ఆంక్షలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shankar bhupalpally collector Murali controversial comments on brahmins.
Please Wait while comments are loading...