హనుమాన్ జయంతి.. కొండగట్టు అంజన్న దరికే దారులన్నీ.. మాలధారులతో కొండగట్టు కిటకిట!!
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు కిటకిటలాడుతోంది. హనుమాన్ మాలధారులతో ఎటు చూసినా కాషాయ వర్ణంగా మారిపోయింది. జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు మార్మోగిపోతోంది. హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కొండగట్టుకు తేతెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.
శోభాయమానంగా కొండగట్టు
కోరి కొలిచే వారి కొంగుబంగారంగా నిలిచి భక్తులందరినీ కరుణిస్తున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి తరలివస్తున్న భక్తులతో కొండగట్టు శోభాయమానంగా కనిపిస్తోంది. గురువారం నాడు కొండగట్టు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభం కాగా ఒక రెండు రోజుల వ్యవధిలోనే రెండు లక్షల మంది హనుమాన్ దీక్ష స్వాములు ఆంజనేయ స్వామిని దర్శించుకొని దీక్ష విరమణ చేశారు.

కొండగట్టులో మూడు రోజులపాటు వేడుకలు
మూడు రోజులపాటు జరిగే వేడుకలలో మూడు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారని అంచనా. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా తొలిరోజు సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం తరుపున ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు ఆలయ అధికారులు సమర్పించారు. హనుమాన్ జన్మించిన వైశాఖ మాసం బహుళ దశమితో పాటు నేడు శనివారం కావడంతో కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తజనం పోటెత్తారు.
కొండగట్టులో హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకం
భారీగా తరలివస్తున్న భక్తులతో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దుచేసి, భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా కొండగట్టు అంజన్నను భక్తులు దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇదిలా ఉంటే కొండగట్టులో హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. విశ్వవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఒకటేసారి జరుగుతూ ఉండగా, కొండగట్టులో మాత్రం రెండు సార్లు హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు.
హనుమంతుడి దయతో పుణ్య ఫలం, బుద్ధిబలం
చైత్రమాసం అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి నిర్వహించగా, వైశాఖ మాసం బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే దుష్ట శక్తులు తొలగిపోతాయని, హనుమంతుడి దయతో పుణ్య ఫలం, బుద్ధిబలం పెరుగుతుందని చెబుతున్నారు.
హనుమాన్ జయంతి నాడు పంచామృతాలతో హనుమాన్ కి అభిషేకం
ఇక నేడు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. సాయంత్రం పూర్ణాహుతి నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఎండాకాలం కావడంతో, ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో కొండగట్టుకు వస్తున్న భక్తుల కోసం ఆలయ అధికారులు విశేష ఏర్పాట్లు చేశారు.
ఎండల కాలం కావటంతో విశేష ఏర్పాట్లు
చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడంతోపాటు, కొండపై కాళ్లు కాలకుండా కార్పెట్ లను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న హనుమాన్ భక్తుల కోసం, మాలధారుల కోసం కరీంనగర్ రూట్ లో, జగిత్యాల రూట్ లో పలుచోట్ల చలివేంద్రాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications